← Back to news

ఎండ, వానల్లో నిరీక్షణకు చెక్.. దాచేపల్లిలో కొత్త బస్ బే!

By Siva· 1h ago· Dachepalle, Dachepalli, Palnadu
ఎండ, వానల్లో నిరీక్షణకు చెక్.. దాచేపల్లిలో కొత్త బస్ బే!

పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో ప్రయాణికుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన ఈ-బస్ బేను శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎండ, వానల్లో రోడ్లపై నిరీక్షిస్తున్న ప్రయాణికులకు కొత్త బస్ బే ఉపశమనం కలిగించనుంది.

More in Local