← Back to news

ఏకగ్రీవంగా ఎన్నికైన పలివెల సత్యనారాయణ

By బొమ్ము దుర్గారావు· 1h ago· Velampalem, Ramachandrapuram, Dr. B.R. Ambedkar Konaseema
ఏకగ్రీవంగా ఎన్నికైన పలివెల సత్యనారాయణ

బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మాదిగ లాయర్స్ ఫెడరేషన్ అధికార ప్రతినిధిగా రామచంద్రపురానికి చెందిన న్యాయవాది పలివెల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమలాపురంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు వీరదాసు వెంకటరత్నం, జాతీయ అధికార ప్రతినిధి ప్రసాదరావు సమక్షంలో ఆయనను ఎన్నుకున్నారు. గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా సత్యనారాయణ బాధ్యతలు నిర్వర్తించారు.

More in Local