కొత్తపేటలో వితంతు పెన్షన్ల పంపిణీ
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని కొత్తపేటలో నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను టీడీపీ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కొత్తగా పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని టీడీపీ నాయకులు చెప్పారు.


