లంచం తీసుకుంటూ దొరికిన ఆఫీసర్లు

మొయినాబాద్ మున్సిపాలిటీలో 75 వేల రూపాయిల లంచం తీసుకుంటుండగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి, సీనియర్ అసిస్టెంట్ సుదర్శన్‌లను నిన్న ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిర్మాణంపై యాక్షన్ తీసుకోకుండా ఉండటానికి వీళ్లు డబ్బులు డిమాండ్ చేసినట్లు తేలింది. వీరిద్దరిపై కేసు ఫైల్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. గవర్నమెంట్ ఆఫీసర్లు లంచం అడిగితే టోల్‌ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని ACB సూచించింది.



