← Back to news

ఇతరుల అభిప్రాయాల గురించి పట్టించుకోను: మీనాక్షి

By Anusha· 1d ago
ఇతరుల అభిప్రాయాల గురించి పట్టించుకోను: మీనాక్షి

నటి మీనాక్షి చౌదరి తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా, తన లక్ష్యాలను చేరుకోవడంపైనే దృష్టి పెడతానని చెప్పారు. ఎన్నిసార్లు విఫలమైనా ప్రయత్నించడం ఆపలేదన్నారు. రోజువారీ జీవితంలోనే ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయని, ఇతరుల అభిప్రాయాల గురించి ఆలోచిస్తూ వాటిని పెంచుకోవద్దని సూచించారు. తన కోసం తాను కష్టపడతానని తెలిపారు. నాగచైతన్యతో కలిసి ఆమె నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమా డిసెంబరులో విడుదల కానుంది.

More in Entertainment