సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

ప్రసిద్ధ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా(75) చెన్నైలో కన్నుమూశారు. ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను చెన్నైలోని సూర్య ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. 1990 కాలంలో తమిళ సినీ సంగీతంలో ఆయన సరికొత్త ఒరవడి సృష్టించారు. తెలుగులో ‘తొలిప్రేమ’, ‘మాస్టర్’, ‘ఆటోడ్రైవర్’, ‘నాగ’, ‘విజయదశమి’ తదితర తెలుగు చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. వీటితోపాటు తమిళంలోనుంచి తెలుగులోకి అనువాదమైన ‘బాషా’, ‘ప్రేమలేఖ’, ‘ఆశ ఆశ ఆశ’ చిత్రాలు తెలుగులో ఆయనకు గుర్తింపు తెచ్చాయి.


