కీర్తి సురేష్ బర్త్డే గిఫ్ట్.. ‘అక్క’ టీజర్ వచ్చేసింది!
కీర్తి సురేష్ బర్త్డే సందర్భంగా ఆమె నటిస్తున్న ‘అక్క’ వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ అయింది. ఇందులో కీర్తి భవానిగా, రాధికా ఆప్టే రుద్రగా కనిపించనున్నారు. 1980ల కాలంలో మహిళల ఆధిపత్యంలో ఉండే పెర్నూరు అనే కల్పిత నగరంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ కథ సాగుతుంది. ఇద్దరు పవర్ఫుల్ మహిళల మధ్య జరిగే పోరాటం ఈ సిరీస్లో మెయిన్ హైలైట్గా ఉండనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 30 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. టీజర్తో ఈ సిరీస్పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.


