'LinkedIn'లోకి విరాట్ కోహ్లీ ఎంట్రీ

టీమిండియా క్రీకెటర్ విరాట్ కోహ్లీ తొలిసారిగా 'LinkedIn'లో అడుగుపెట్టాడు. ఈరోజు తన ఫస్ట్ పోస్ట్లో భారత క్రీడా రంగంపై తన ఆలోచనలు, భవిష్యత్తు లక్ష్యాలను పంచుకున్నాడు. ఇప్పటికే ప్రముఖ బ్రాండ్లతో కలిసి పనిచేస్తున్న కోహ్లీ, అజిలిటాస్లో పెట్టుబడిదారుడిగా, వన్8 వరల్డ్ కొఫౌండర్గా కొనసాగుతున్నాడు. తాజాగా లింక్డిన్లో తన అభిప్రాయాలను పంచుకుంటూ మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు.




