గాంధీ జయంతి.. సూర్యాపేట మార్కెట్ కార్యాలయంలో ఘన నివాళి!

అహింసనే ఆయుధంగా చేసుకొని భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు మహాత్మా గాంధీ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయడమే గాంధీజీకి అందించే ఘనమైన నివాళి అని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.


