నీటిలో శిశువు మృతదేహం..జనాలు షాక్
AP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కాసింతల బ్రిడ్జి దగ్గర అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం నీటిలో తేలుతూ కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తులు పాపను నీటిలో పడేసి వెళ్లిపోయారు. పసికందు శవం చుట్టూ కుక్కలు గుమికూడటం చూసి స్థానికులు ఒక్కసారిగా షాకయ్యారు. పోలీసులకి సమాచారం అందించడంతో వారు స్పాట్‌కి చేరుకున్నారు.


