బహుజనుల హత్యలపై BSP కలెక్టరేట్ ముట్టడి
విజయనగరం జిల్లా కలెక్టరేట్‌ను BSP నాయకులు ముట్టడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 27 మంది బహుజనులు హత్యకు గురయ్యారని BSP ఆరోపించింది. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యలపై వేగంగా విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో BSP నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



