ఫారమ్-6పై సుప్రీంకోర్టు క్లారిటీ.. రాహుల్ ఫైర్

SIRలో ఫారమ్-6 మార్పులపై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. మార్చిన ఫారమ్-6ను తాము ఆమోదించలేదని CJI సూర్యకాంత్ స్పష్టం చేశారు. రికార్డులు వచ్చిన తర్వాత ఎవరు మార్పులు చేశారో చూస్తామని చెప్పారు. దీనిపై రాహుల్ గాంధీ CEC జ్ఞానేశ్ కుమార్‌పై విమర్శలు చేశారు. ఫారమ్-6ను చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా మార్చారని ఎక్స్‌లో ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం, CEC, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

