న్యాయవ్యవస్థలో మార్పులు- SC

సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. దేశంలో జ్యుడీషియల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ మొత్తాన్ని మార్చాలని అనుకుంటున్నట్లు జస్టిస్ జాయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ మోహన బెంచ్ తెలిపింది. గుజరాత్ హైకోర్టు డిస్ట్రిక్ట్ జడ్జ్ పోస్టుల భర్తీలో 113 వేకెన్సీస్ ఉన్నా ఒక్కరిని కూడా సెలెక్ట్ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఇద్దరు లాయర్స్ పిటిషన్ వేశారు. మెయిన్స్ పాసైన వీరికి ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వేసి రిజెక్ట్ చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, ఎగ్జామినేషన్ సిస్టమ్ రీఫార్మ్స్ పై ఫోకస్ పెడతామని స్పష్టం చేసింది.



