బెనర్జీకి సుప్రీం బిగ్ షాక్!

తృణమూల్ కాంగ్రెస్‌కి సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది. తమ పార్టీకి చెందిన నాలుగు బ్యాంక్ అకౌంట్లను వెస్ట్ బెంగాల్ CID పోలీసులు ఫ్రీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ TMC దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. MBA గ్రాడ్యుయేట్ అయిన MLA విశ్వనాథ్ దాస్ ఇచ్చిన సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఆధారంగానే బ్యాంక్ ఖాతాలను నిలిపివేశారు. హైకోర్టును ఆశ్రయించకుండా డైరెక్ట్‌గా సుప్రీంకోర్టుకు రావడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి స్పెషల్ రెలీఫ్ ఇవ్వలేమని స్పష్టం చేసింది.



