← Back to news

హన్మకొండలో పవన్ కల్యాణ్

By dk· 17 Jun 2026· Dishadaily· హన్మకొండ

AP డిప్యూటీ CM పవన్ కల్యాణ్ హన్మకొండకు చేరుకున్నారు. హనుమాన్‌నగర్‌కు చెందిన బాలుడు నిరంజన్(17) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన చివరి కోరిక అభిమాన నటుడైన పవన్ కల్యాణ్‌ను కలవడమేనని చెప్పడంతో బాలుడిని చూసేందుకు పవన్ వారి ఇంటికి వెళ్లారు. చాలా కాలంగా కాళ్లు పనిచేయక బాలుడు బాధపడుతున్నాడు. నరాల సంబంధిత వ్యాధి కారణంగా నిరంజన్ కాళ్లు పనిచేయడం లేదు. విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ నిరంజన్‌ను పరామర్శించారు. బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి అతని ఆరోగ్య సమస్యలు, చికిత్స వివరాలు తెలుసుకున్నారు.

More in Politics