రాష్ట్రానికి గర్వకారణం: డిప్యూటీ సీఎం

AP: ఆంధ్రప్రదేశ్‌లోని 23 గ్రామ పంచాయతీలు ప్రతిష్ఠాత్మక ISO 9001:2015 సర్టిఫికేషన్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ఘనత సాధించిన గ్రామ పంచాయతీలను, అంకితభావంతో కృషి చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని అభినందించారు. సిబ్బందికి నిరంతర శిక్షణ, సమీక్షలు వంటి ఉత్తమ పాలనా ప్రమాణాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.


