ఆధార్ కార్డులో ఏపీ పేరు ఉందా? 60 రోజులే గడువు!

జోగులాంబ గద్వాల జిల్లాలో ఆధార్ కార్డుల చిరునామాలో రాష్ట్రం పేరు ‘ఆంధ్రప్రదేశ్’గా ఉన్నవారు ‘తెలంగాణ’గా మార్చుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. పబ్లిక్ నోటీసు జారీ చేసిన తేదీ నుంచి 60 రోజుల గడువు ఇచ్చినట్లు తెలిపారు. ఈలోగా సవరించుకోకపోతే UIDAI రాష్ట్రం పేరును స్వయంగా మారుస్తుందని స్పష్టం చేశారు. ఈ మార్పు రాష్ట్రం పేరు వరకే పరిమితమవుతుందని పేర్కొన్నారు.



