← Back to news

నిరుపేద మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

By Ashraf SD· 56m ago· Parkal, Parkal, Hanumakonda
నిరుపేద మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన 154 మంది పేద మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. శిక్షణ, టెక్స్‌టైల్ పార్క్‌లో ఉద్యోగాలు, బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. రూ.2 కోట్లతో షాదీఖానా నిర్మాణం, ఈ-మోపెడ్ బైక్‌లపై 100% సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు.

More in Local