← Back to news

యాపిల్‌లో మరోసారి లేఆఫ్‌లు.. 2 నెలల్లోనే రెండోసారి!

By Anusha· 1d ago
యాపిల్‌లో మరోసారి లేఆఫ్‌లు.. 2 నెలల్లోనే రెండోసారి!

ప్రముఖ టెక్‌ సంస్థ యాపిల్‌లో మరోసారి ఉద్యోగులపై వేటు పడింది. రెండు నెలల్లో ఇది రెండో లేఆఫ్‌గా ఇంటర్‌నేషనల్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈసారి ఫిట్‌నెస్‌+ ఆడియో టీమ్‌లోని పలువురు ఉద్యోగులను తీసేసినట్లు సమాచారం. ‘టైమ్‌ టు వాక్‌’, ‘టైమ్‌ టు రన్‌’ కంటెంట్‌పై పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్లను యాపిల్‌ పూర్తిగా నిలిపివేయలేదు. ఆగస్టులోనూ 200 మందికి పైగా ఉద్యోగులను సంస్థ తొలగించింది.

More in Business