పండ్లు, కూరగాయలతో దుర్గమ్మ కళాకృతి
ఒడిశాలోని పూరి సముద్ర తీరంలో ప్రముఖ ఇసుక కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ పండ్లు, కూరగాయలతో దుర్గమ్మ కళాకృతిని రూపొందించారు. సుమారు 8 టన్నుల ఇసుకతో 10 అడుగుల ఎత్తులో ఈ కళాకృతిని ఐదు గంటల్లో తయారు చేశారు. 22 రకాల కూరగాయలు, 10 రకాల పండ్లను ఉపయోగించి దుర్గాపూజ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఇసుక కళా సంస్థకు చెందిన విద్యార్థులు కూడా ఈ కళాకృతి తయారీలో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక రూపం పర్యాటకులను ఆకట్టుకుంది.
