CCTVలో షాకింగ్ సీన్
హర్యానాలోని పానిపట్లో ఓ 8 ఏళ్ల బాలుడు నడుస్తూ ప్రమాదవశాత్తూ మూతలేని డ్రైన్లో పడిపోయాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వెంటనే స్పందించి బాలుడిని బయటకు తీశాడు. ఈ ఘటన CCTVలో రికార్డైంది. అయితే, అదే రోడ్డుపై నెల రోజుల క్రితం ఓ మహిళ కూడా డ్రైన్లో పడిపోయినట్లు సమాచారం, అయినా డ్రైన్కు మూతలు లేకపోవడం, రోడ్డుపై బురద ఉండటంపై స్థానికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరో ప్రమాదం జరిగితేనే మేల్కొంటారా? అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
