← Back to news

వెల్గటూర్‌లో వృద్ధుడి ఆత్మహత్యాయత్నం!

By Srikanth Goud· 1h ago· Jagitial, Jagitial, Jagitial
వెల్గటూర్‌లో వృద్ధుడి ఆత్మహత్యాయత్నం!

జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో పెద్దవాగు బ్రిడ్జి వద్ద ఓ వృద్ధుడు ఆత్మహత్యకు యత్నించగా జాలర్లు సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడారు. బ్రిడ్జిపై నుంచి దూకిన వృద్ధుడిని గమనించిన స్థానికులు జాలర్లకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న వారు అతడిని రక్షించారు. హైదరాబాద్‌కు చెందిన విజయ శ్రీనివాస్ దత్తాత్రేయ(85)గా గుర్తించారు. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

వెల్గటూర్‌లో వృద్ధుడి ఆత్మహత్యాయత్నం!

More in Local