40 ఏళ్ల తర్వాత.. మళ్లీ రియల్ హీరోస్!

1986లో నీరజా భానోత్.. 2026లో కెప్టెన్ స్మిత్ మచ్ఛర్. నాలుగు దశాబ్దాల తేడాలో ఇద్దరూ విమానాల్లో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొని ప్రయాణికులను కాపాడారు. 1986లో పాన్ యామ్ ప్లేన్ హైజాక్ సమయంలో నీరజా.. ప్రయాణికులను బయటకు పంపించి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ కత్తి దాడిని ఎదుర్కున్న మచ్ఛర్.. ప్రాణాలకు తెగించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చేశారు. ఈ ఇద్దరి ధైర్యం స్ఫూర్తిని రగిలిస్తోంది.


