← Back to news

రెండు కొండలు దాటితేనే బడి.. 40 మంది విద్యార్థుల బాధ!

By B V Appalanaidu· 1h ago· Gannela, Araku Valley, Alluri Sitharama Raju

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెల పంచాయతీ కింటీబైడి గ్రామంలో పాఠశాల భవనం, ఉపాధ్యాయుడు లేక సుమారు 40 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సమీప చబ్కాని పాఠశాలకు వెళ్లాలంటే రెండు కొండలు దాటాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పాఠశాల భవనం నిర్మించి, ఉపాధ్యాయుడిని నియమించాలని మాజీ ఎంపీటీసీ గోవిందరావు కోరారు. లోకేష్, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

More in Local