క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో కొత్త నానో టెక్నాలజీ

TG: హైదరాబాద్ CSIR-IICT శాస్త్రవేత్తలు క్యాన్సర్ చికిత్సలో కీలక పురోగతి సాధించారు. డాక్టర్. అవిజిత్ జానా నేతృత్వంలోని బృందం ‘సిగ్నల్ నానో’ అనే కొత్త నానో ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది. అధిక ROS ఉన్న క్యాన్సర్ కణాలను గుర్తించి, ఎరుపు కాంతితో మైటోకాండ్రియాలోకి మందును విడుదల చేసేలా దీన్ని అభివృద్ధి చేశారు. 3D ట్యూమర్, చర్మ క్యాన్సర్ నమూనాల్లో మంచి ఫలితాలు కనిపించాయి. పరిశోధన ‘జర్నల్ ఆఫ్ మెటీరియల్స్ కెమిస్ట్రీ బి’లో ప్రచురితమైంది.



