← Back to news

భారీగా రద్దయిన పాత నోట్లు పట్టివేత

By Bala· 1h ago· TG
భారీగా రద్దయిన పాత నోట్లు పట్టివేత

TG: హన్మకొండ జిల్లా కాజీపేట చౌరస్తాలో వాహన తనిఖీల సందర్భంగా రద్దు చేసిన పాత రూ.500, రూ. 1,000 నోట్లను (రూ.1,38,50,000) అక్రమంగా చలామణి చేసేందుకు యత్నించిన 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పాత కరెన్సీ, రూ. 6 వేల చెల్లుబాటు నగదు, 10 ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రజలను మోసం చేసి అసలు కరెన్సీ పొందేందుకు యత్నించినట్లు కాజీపేట ఏసిపి ప్రశాంత్రెడ్డి వెల్లడించారు. సీఐ జక్కుల శ్యామసుందర్ తదితరులు ఉన్నారు.

More in TG