Tejas ఎక్కిన జపాన్ ఎయిర్ చీఫ్.. ‘Make in India’కి ఫిదా!
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో భారత్–జపాన్ "వీర్ గార్డియన్ వైమానిక విన్యాసాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 20న భారత ఎయిర్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్, జపాన్ ఎయిర్ చీఫ్ టేకిహిరో మోరిటా ఇద్దరూ Tejas విమానంలో ప్రయాణించారు. జపాన్‌కు చెందిన F-2A విమానాలు భారత్‌లో ఈ విన్యాసానికి రావడం ఇదే తొలిసారి. రెండు దేశాల సైనికులూ కలిసి శిక్షణ తీసుకుంటూ, తమ అనుభవాలను పంచుకుంటున్నారు. Tejasలో ప్రయాణించిన మోరిటా.. భారత టెక్నాలజీ, Make in Indiaకి Tejas మంచి ఉదాహరణ అని మెచ్చుకున్నారు.


