← Back to news

ఇటలీలో భారత వీరుడికి మరోసారి గౌరవం

By Nani Eluri· 5h ago· News18
ఇటలీలో భారత వీరుడికి మరోసారి గౌరవం

నాయక్ యశ్వంత్ ఘాడ్గే.. మహారాష్ట్రకు చెందిన భారత సైనికుడు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలోని 5వ మరాఠా లైట్ ఇన్‌ఫ్యాంట్రీలో పనిచేశారు. 1944లో ఇటలీలో జర్మన్ సైనికులతో జరిగిన పోరులో 23 ఏళ్ల వయసులో వీరమరణం పొందారు. ధైర్యంగా పోరాడినందుకు ఆయనకు మరణం తర్వాత విక్టోరియా క్రాస్‌ని ప్రకటించారు. ఆయన జ్ఞాపకార్థం ఇటలీలోని మోంటోన్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా ఆయన పేరుతో కొత్త ట్రెక్కింగ్ మార్గాన్ని ప్రారంభించారు. ఇలా ఇటలీ ఆయన త్యాగాన్ని మళ్లీ గుర్తు చేసుకుంది.

ఇటలీలో భారత వీరుడికి మరోసారి గౌరవం

More in National