డొక్కు ఫోనే కదాని పారేస్తే !!

పాత మొబైల్ ఫోన్లకు స్టీలు పాత్రలిస్తామనే వాళ్ల మాటలు నమ్మితే మొదటికే మోసం..ఇలా వీధుల్లో తిరిగేవారి వెనక పెద్ద నెట్ వర్క్ ఉందని యూపీ, బీహార్ పోలీసులు కనుగొన్నారు. పాత ఫోన్ల లారీ లోడ్ ను పట్టుకుని ఆరా తీయగా అందులో 11 వేల డొక్కు ఫోన్లు ఉన్నాయి. వాటి విలువ కోటి రూపాయలని తేలింది. ఇస్తార్ ఆలం అనే ఓ వ్యాపారి ఈ ఫోన్ల మదర్ బోర్డుని, రామ్ ను తొలగించి దాని నుంచి డేటాను వేరు చేసి సైబర్ నేరగాళ్లకు పంపుతున్నాడు. వాటిల్లోని బ్యాంక్ ఎక్కౌంట్లు, పాస్ వర్డ్ లు, నెంబర్లు సేకరించి ఆ కేటుగాళ్లు బ్యాంకుల్లో డబ్బును కొల్లగొడుతున్నారు. సో పాత ఫోన్లను అలా ఇచ్చేయకండి..



