← Back to news

గాంధీ జయంతి.. చినలబుడులో గ్రామసభ!

By B V Appalanaidu· 1h ago· Chinalabudu, Araku Valley, Alluri Sitharama Raju
గాంధీ జయంతి.. చినలబుడులో గ్రామసభ!

గాంధీ జయంతి సందర్భంగా అరకులోయ మండలం చినలబుడు పంచాయతీలో శుక్రవారం గ్రామసభ జరిగింది. ముఖ్య అతిథిగా ఎంపీడీవో వీసం ప్రసాద్ హాజరై గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న సేవలపై చర్చించారు. గ్రామస్థుల సమస్యలు తెలుసుకుని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు.కార్యక్రమంలో పంచాయతీ డెవలప్‌మెంట్ అధికారి బి.వి. మహేష్, వివిధ శాఖల సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

More in Local