గణేష్ నిమజ్జనానికి ఫుల్ సెక్యూరిటీ!

పెద్దపల్లి జిల్లా రామగుండంలో గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు. 500 మంది పోలీసులతో బందోబస్తు. కమిషనరేట్ పరిధిలో 5,189 విగ్రహాలు, 77 నిమజ్జన స్పాట్స్ రెడీ. క్రేన్లు, ఫ్లడ్‌లైట్లు, ప్లాట్‌ఫారాలు, డ్రింకింగ్ వాటర్, గజ ఈతగాళ్లు అందుబాటులో. సీసీ, డ్రోన్ కెమెరాలతో నిఘా. డీజేలు, బాణాసంచా బ్యాన్. నిర్వాహకులు పోలీసులకు సపోర్ట్ చేయాలని సీపీ అంబర్ కిషోర్ ఝా కోరారు.



