గోదావరిలో మునిగి వ్యక్తి మృతి

గోదావరిలో స్నానానికి వెళ్లిన వ్యక్తి మునిగి మృతి చెందాడు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీసగొని లచ్చయ్య (51). మంగళవారం మధ్యాహ్నం ధర్మపురి సంతోషిమాత ఆలయం సమీపంలో గోదావరిలోకి దిగాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. గజ్జి మల్లేష్ గాలించి బయటకు తీసుకొచ్చాడు. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ధర్మపురి ఎస్ఐ సధాకర్ దర్యాప్తు చేస్తున్నారు.



