స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు.. నంద్యాలలో 68 మందికి ప్రధానం!

స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్ర పరిసరాలతోనే ఆరోగ్యకర సమాజం సాధ్యమని మంత్రి ఎన్ఎండి ఫరూక్, కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ PGRS హాల్‌లో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో స్వచ్ఛతలో విశిష్ట సేవలు అందించిన 68 మందికి అవార్డులు అందజేసి అభినందించారు. నంద్యాలలో రూ.17 లక్షలతో బయో డైజెస్టర్ ఏర్పాటు, రోజుకు 1000 కిలోల వ్యర్థాల ప్రాసెసింగ్,వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.




