ఆయుర్వేద వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం: డాక్టర్ శ్రీనివాస్

పల్నాడు జిల్లా జయంతిరామాపురంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన సదస్సు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ నాయకత్వంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. బిపి, షుగర్, కీళ్లవాతం, అసిడిటీ వంటి సమస్యలకు వైద్య పరీక్షలు చేసి, సుమారు 95 మందికి ఉచితంగా ఆయుష్ మందులు పంపిణీ చేశారు. ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయాలని డాక్టర్ శ్రీనివాస్ సూచించారు.



