"ఎంత కాలం కాపాడతారు?" నేహా బోరా ఫైర్
"CEC జ్ఞానేష్ కుమార్‌ని ఎంత కాలం కాపాడతారు" అని కేంద్రాన్ని ప్రశ్నించారు AISA చీఫ్ నేహా బోరా. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న ఆమెను పోలీసులు డిటైన్ చేశారు. "ఇలా బస్సులు పెట్టి.. మా లాంటి వాళ్లను డిటైన్ చేస్తూ.. ప్రజాస్వామ్యాన్నీ, ప్రజల గొంతునూ నొక్కేస్తున్నారు. మీరు 2వేల బస్సులు పెట్టినా, 20 లక్షల మందిని డిటైన్ చేసినా.. ఎలక్షన్ కమీషనర్లను కాపాడలేరు. ఇది దేశద్రోహం. సామాన్యుల జీవితాలతో ఆడుకున్న జ్ఞానేష్‌ని ప్రజలు క్షమించరు" అని ఆమె ఫైర్ అయ్యారు.