← Back to news

'యువతా.. డ్రగ్స్‌కు దూరంగా ఉండండి'

By NANI M· 1h ago· Rowthulapudi, Rowthulapudi, Kakinada

కాకినాడ జిల్లా రౌతులపూడిలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ వద్దు.. జీవితం ముద్దు’ అంటూ ప్రచారం చేపట్టారు. మాదకద్రవ్యాలు, చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వినియోగంపై సమాచారం ఇచ్చే వారికి బహుమతి అందిస్తామని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్సై తెలిపారు.

More in Local