దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు!
TG: ఢిల్లీలోని తెలంగాణ భవన్ గేటు వద్ద దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలంగా మారింది. ఖైరతాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడి పేరుతో ఉన్న ఈ ఫ్లెక్సీల్లో దానం నాగేందర్‌పై విమర్శలు చేశారు. గతంలో BRS తరఫున ఖైరతాబాద్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన విషయాన్ని ప్రస్తావించారు. మళ్లీ ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి.

