← Back to news

దొంగతనం అనుమానం.. కుర్చీకి కట్టేసి కొట్టారు

By A.Ajay· 1h ago

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో దారుణం జరిగింది. దొంగతనం అనుమానంతో ఇంటి పనిమనిషిని కుర్చీకి కట్టేసి కొట్టేశారు. సెప్టెంబర్ 30న కోత్వాలి దేహాత్‌ పరిధిలోని నెక్స్రా కాలనీలో ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఉపాసన కంప్లైంట్‌తో ఆకాంక్ష, ఆషిష్, దీపిక, సోనీ, వాణిపై కేసు నమోదైంది. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, నిందితుల కోసం వెతుకుతున్నారు.

More in National