40 ఏళ్లు దాటాయా?

40 ఏళ్లు దాటాయా? ఇక హెల్త్ విషయంలో నిర్లక్ష్యం వద్దు! ఈ వయసులో కండరాలు తగ్గడం, మెటబాలిజంలో మార్పులు రావడం సహజం. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోజూ ప్రోటీన్ ఉన్న ఆహారం, పండ్లు, నట్స్ తీసుకోవాలి. కనీసం 30నిమిషాలు వాకింగ్ చేయాలి. వారానికి 2 నుంచి 3 సార్లు ఎక్సర్సైజ్ చేయాలి. రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ టెస్ట్లు చేయించుకోవాలి. ఈ అలవాట్లు ఆరోగ్యంగా, ఫిట్గా ఉండేందుకు సహాయపడతాయి.



