గర్బా డ్యాన్స్ చేస్తున్నారా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

గర్బా సీజన్లో గంటల తరబడి డ్యాన్స్ చేయడం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి అలవాటు లేకుండా ఎక్కువసేపు డ్యాన్స్ చేయడం ప్రమాదకరమనీ, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డ్యాన్స్ ఆపి వైద్య సహాయం తీసుకోవాలని చెప్తున్నారు. మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ, తగినంత నీరు తాగుతూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.



