34% రిజర్వేషన్ సామాజిక న్యాయానికి నిదర్శనం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయడంపై TDP సీనియర్ నాయకుడు ఈబీజీ గోవింద్ గౌడ్ హర్షం వ్యక్తం చేస్తూ హొళగుందలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఫొటోలకి పాలాభిషేకం చేశారు. లీగల్ ఇష్యూస్ ఎదురవుతున్నా బీసీలకు న్యాయం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో స్థానిక టీడీపీ లీడర్స్ పాల్గొన్నారు.

