ఢిల్లీలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ
రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ ర్యాలీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ లీడర్స్, కేడర్ భారీగా పాల్గొన్నారు. ఎలక్షన్ ఆఫీసర్ జ్ఞానేష్ కుమార్ రిజైన్ చేయాలని, ఓటు చోరీని కంట్రోల్ చేయాలని నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు మీదుగా సాగిన ఈ మార్చ్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య సహా పలువురు తెలంగాణ లీడర్స్ పాల్గొన్నారు.


