చిరు వ్యాపారులకు టిఫిన్ బండ్లు!

గుంటూరు జిల్లా మంగళగిరిలో నిరుపేద కుటుంబాలకు స్వయం ఉపాధి దారి చూపే కార్యక్రమం జరిగింది. మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ సొంత నిధులతో ఈ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని టీడీపీ మండల అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు తెలిపారు. నిడమర్రు బీసీ కాలనీకి చెందిన దూపాటి వెంకటరమణకు టిఫిన్ బండి, నవులూరు ఉడా కాలనీకి చెందిన పఠాన్ జైనాబీకి తోపుడు బండి అందజేశారు. చిరు వ్యాపారాల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ సహాయం చేసినట్లు తెలిపారు.


