వెండి టూ కాస్ట్ లీ !!

వెండి రేట్లకి రెక్కలొచ్చాయి.. కేవలం ఇవాళ ఒక్క రోజులోనే ఏకంగా పదివేల రూపాయలు పెరిగి బంగారంతో సమానంగా దూసుకుపోతోంది వెండి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కేజీ వెండి రేటు ఏకంగా రూ.10,000 పెరిగింది. దీంతో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ..2,65,000 కు చేరుకుంది. పెళ్లిళ్ల సీజన్ కావడం కూడా దీనికి తోడయ్యింది. కాబట్టి అకేషన్లకు వెండి వస్తువులు కొనేవారు కాస్త ఆలోచించాల్సిన టైమ్ ఇది..



