← Back to news

ఆసియా క్రీడల్లో చికితకు రెండు స్వర్ణాలు

By Srikanth Goud· 2h ago· Peddapalle (Ct), Peddapalli, Peddapalli
ఆసియా క్రీడల్లో చికితకు రెండు స్వర్ణాలు

ఆసియా క్రీడలు–2026లో పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానాపూర్‌కు చెందిన ఆర్చర్ తానిపర్తి చికిత సత్తా చాటారు. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ, ప్రీతికా ప్రదీప్‌తో కలిసి చైనాపై విజయం సాధించి స్వర్ణ పతకం పొందారు. అనంతరం కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సాహిల్ జాదవ్‌తో కలిసి దక్షిణ కొరియాపై గెలిచి రెండో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ కోటాను కూడా ఖరారు చేసుకున్నారు.

More in National