బ్యాగ్ కోసం మహిళపై దాడి.. వీడియో వైరల్
అస్సాంలోని గువాహటిలో మహిళపై దారుణ ఘటన జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ బ్యాగ్‌ను స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు దొంగలించేందుకు ప్రయత్నించారు. మహిళ బ్యాగ్‌ను వదలకపోవడంతో ఆమెను కొంతదూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. అయినా బ్యాగ్‌ను దక్కించుకోలేక నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మహిళా భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.

