కందుకూరులో ఫామ్ పాండ్స్‌పై ఆకస్మిక తనిఖీ..!

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరులో VB-G RAM G పథకం కింద చేపట్టిన ఫామ్ పాండ్స్ పనులను DRDO కొండపల్లి శ్రీరామ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వేంసూరు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతి, అమలు తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో APD చలపతి, MPDO కావ్య, APO విజయబాబు తదితరులు పాల్గొన్నారు.



