గణేష్ మండపాల్లో డీజేలకు నో!
నిజామాబాద్ జిల్లా నందిపేట్, డొంకేశ్వర్ మండలాల్లో గణేష్ ఉత్సవాలపై పోలీసులు సమన్వయ సమావేశం పెట్టారు. ఆర్మూర్ ACP జె. వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. మండపాల వద్ద డీజేలు, అధిక శబ్ద సౌండ్ సిస్టమ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని స్పష్టం చేశారు. భద్రతా ఏర్పాట్లు, విద్యుత్ వైరింగ్పై జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సీఐ జాన్రెడ్డి, ఎస్సై కె. విజయ్, అధికారులు, సర్పంచులు, నిర్వాహకులు పాల్గొన్నారు.



