పర్యాటక అవార్డులకు దరఖాస్తులు..!

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పర్యాటక విశిష్టతా అవార్డుల ప్రకటన వచ్చింది. జిల్లా పర్యాటక అధికారి పట్టాసి చలపతిరావు ఈ వివరాలు తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వార్షిక పర్యాటక విశిష్టత పురస్కారాలు-2025-26కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 38 విభాగాల్లో మొత్తం 46 పురస్కారాలు అందిస్తారు. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 18లోగా దరఖాస్తు చేయాలి. పురస్కారాలు సెప్టెంబర్ 27న ప్రదానం చేస్తారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.


