పోలీస్ అధికార పరిధిలో బిగ్ రీ-ఆర్గనైజేషన్

సంగారెడ్డి జిల్లా పోలీస్ అధికార పరిధిని పునర్వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనా సౌలభ్యం, శాంతిభద్రతల సమర్థవంతమైన పర్యవేక్షణతో పాటు ప్రజలకు సత్వర పోలీస్ సేవలు అందించేందుకు కొత్త విభాగాలు, సర్కిళ్లు, PSలను ఏర్పాటు చేయనున్నారు. జిన్నారం సబ్‌డివిజన్, గుమ్మడిదల సర్కిల్, ఇస్నాపూర్ పోలీస్‌స్టేషన్‌ను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. గడ్డపోతారం PSను రద్దు చేయడంతోపాటు పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పేరును మార్చనున్నారు.


